విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్ రాకపోవడంతో ఆయన కోసం బుధవారం వరకు పూర్ణాహుతి యాగాన్ని పొడిగించారు. ఇవాళ ఉదయం 11:40 గంటలకు సీఎం జగన్ పీఠానికి చేరుకుంటారు.
రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత పీఠార్చనలో పాల్గొంటారని శ్రీ శారదా పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను దర్శించి, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుని సీఎం తిరిగి పయనమవుతారని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa