భారత్‌తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతుండగానే.. చైనా పరిశోధనా నౌక జియాంగ్ యాంగ్ హాంగ్-03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని నగరం మాలే తీరంలో యాంకరింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం దిగువ ఉపరితలంపై పరిశోధనలు చేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ఇక్కడి జలాల్లో జలాంతర్గాముల తరలింపునకు అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం బీజింగ్‌కు లభించనుందని నౌకాదళ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.