ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు - పేదలకు ఇళ్ళు పథకంలో భాగంగా ఇంటి స్థలాలు మంజూరు చేసింది. అయితే ప్రజలకు మంజూరు చేసినటువంటి ఇంటి పట్టాలలో వివరాలు రిజిస్ట్రేషన్, వాటి వివరాలు నమోదు కోసం దరఖాస్తులు పట్టుకొని బుధవారం ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు ప్రజలు ఎగబడ్డారు. కార్యాలయంలో అధికారులు ఎంతసేపటికీ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.