జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జరుగుతున్న జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా వైద్యశాఖ అధికారి కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించడానికి మంచి పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు.