మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు సీఎం జగన్ మరో షాక్ ఇచ్చారు. ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ నేడు (గురువారం) విశాఖకు వస్తున్నారు. అయితే ఆయనను స్వాగతం పలికే ఆ బాధ్యతను మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమర్ నాథ్ మంత్రి అయిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో వారికి స్వాగతం పలికే బాధ్యతను ఆయనకు జగన్ అప్పగించేవారు. తాజాగా ఈ విషయంలో ఆయనను పక్కన పెట్టారు. కాగా ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి ఇన్ఛార్జీగా మరొకరిని జగన్ నియమించారు.