ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును నమ్మేదెవరని ఏపీ ప్రభుత్వ సామాజికన్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్ నాయకత్వంలో దూసుకువెళ్తోంది. ఆయన్ను ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ కుట్ర పూరితంగా ఒకటవుతున్న విధానం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సిద్ధం అనే శబ్దాన్ని రణనినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతో రాష్ట్రంలో వైయస్ జగన్ పెడుతున్న సభలకు వస్తున్న ప్రజలే మా సుపరిపాలనకు నిదర్శనమన్నారు.