చినగంజాంలో 14 ఏళ్ల బాలుడు పాలెపోగు వెంకటేష్ అదృశ్యమైన ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం రాత్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతపురంలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న వెంకటేష్ ఈనెల 12న చినగంజాం లోని తాత ఇంటికి వచ్చాడు. 13వ తేదీన తిరిగి అనంతపురం వెళుతున్నానని తాతకు చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయాడు. కానీ వెంకటేష్ అనంతపురం రాకపోవడంతో అతని తల్లి కోటేశ్వరమ్మ గురువారం చినగంజాం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.