రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలుకు చేరుకున్నారు. నవరత్నాలు పేదలకు ఇల్లు పథకంలో భాగంగా అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ముఖ్యమంత్రి జగన్ కు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి పుష్పగుచ్చం అందజేసి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.