చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. పవన్ కల్యాణ్ కూడా పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు మంత్రి ఆర్కే రోజా కౌంటరిచ్చారు. నాలుగున్నరేళ్లు తెలంగాణ బిడ్డను అని చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి షర్మిల హడావుడి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. మంత్రి రోజా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, రోజా మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నేత చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17వేల పోస్టులను భర్తీ చేశారు. 6,100 భర్తీలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడైనా ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.