ఒంగోలు ప్రజలు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కల నెరవేరుతుంది అని వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నేడు అయన మాట్లాడుతూ.... ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది, గతంలో 800 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకుంటే టీడీపీ వారు కోర్టులకెళ్ళి అడ్డుకున్నారు, టీడీపీ వారు సిగ్గుపడాలి, పేదలకు ఇచ్చే దానిపై రాజకీయాలా, టీడీపీ వారు ఒక్క పట్టా ఇచ్చారా, గతంలో వైయస్‌ఆర్ హయాంలో నేను పట్టాలిచ్చాను, సీఎంగారు ఇచ్చిన మాట మేరకు ఈ పట్టాల కోసం రూ. 231 కోట్లు ఇచ్చారు, కానీ దీనిపై కూడా టీడీపీ వారు కోర్టుకెళ్ళి పేదలకు ఇవ్వడం లేదని అడ్డుకునే ప్రయత్నం చేశారు, రైతులు ఎమ్మెల్యేకు డబ్బులిచ్చారు అన్నారు, నేను ఒక్క రూపాయి అయినా రైతు దగ్గర తీసుకుని ఉంటే నా యావదాస్తి రాసి ఇచ్చేస్తా, నేను ఒకటే చెబుతున్నా, నేను నా రాజకీయ జీవితంలో ఎన్నడూ పొరపాటు చేయలేదు, దివంగత వైయస్‌ఆర్ గారు చెప్పినట్లు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలన్న మాట మేరకు మా ఒంగోలు ప్రజలు నాపై ఇంత ఆప్యాయత చూపించారు. సీఎంగారు ఇళ్ళ పట్టాలతో పాటు ఇళ్ళు కూడా శాంక్షన్ చేశారు, అంతా వైయస్‌ఆర్ పార్టీ వారికి ఇచ్చారని నిన్న ఒకాయన అన్నారు, సిగ్గుపడాలి, ఇల్లు లేని వారికే ఇచ్చాం తప్పు ఇల్లు ఉన్నవారికి ఇవ్వలేదు. పేదలకే పట్టాలిచ్చాం, కొంతమందికి ఇబ్బందుల వల్ల ఇవ్వలేదు, అర్హులు అందరికీ వెంటనే ఇవ్వమని సీఎంగారు చెప్పారు, నీటి సరఫరా కోసం అవసరమైన నిధులు కూడా శాంక్షన్ చేశారు, గతంలో సీఎంగారు ఇచ్చిన మాట ప్రకారం నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం, ఆరేడు నెలల్లో ప్రతి రోజూ ఒంగోలు పట్టణానికి మంచినీటి సరఫరా చేస్తాం, ప్రకాశం జిల్లాలో 12 కు 12 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తాం అని ధీమా వ్యక్తపరిచారు.