ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తని బెదిరించాలని చూసిన భార్య, ఫలితం చిన్నారి మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 11:58 AM

భర్తను బెదిరించేందుకు ఓ తల్లి కూల్‌డ్రింక్ బాటిల్‌లో తెచ్చిన పురుగుల మందు ఐదేళ్ల కుమార్తె ప్రాణాలు తీసేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో  తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్రిగూడేనికి చెందిన పూనెం నాగేంద్రబాబుకు, అందర్వేదిగూడేనికి చెందిన కుమారికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఐదేళ్ల కుమార్తె రితిక ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను భయపెట్టి దారికి తెచ్చుకోవాలని భావించిన కుమారి, పొగాకు తోటలకు కొట్టే జిడ్డు మందును ఓ కూల్‌డ్రింక్ సీసాలో నింపి ఇంటి దగ్గరున్న కంచె వద్ద పెట్టింది.మంగళవారం ఆ బాటిల్‌ను గమనించిన చిన్నారి రితిక, అందులో ఉన్నది కూల్‌డ్రింక్ అని భ్రమపడింది. ఎవరూ చూడని సమయంలో దాన్ని తాగేసింది. కొద్దిసేపటికే తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బుట్టాయగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రితిక మృతి చెందింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa