ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ సైనిక శక్తిని, నౌకాదళం, వాయుసేనలను తుడిసిపెట్టేసాం

international |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 11:53 AM

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే కేవలం గంట వ్యవధిలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయగలమని తీవ్రంగా హెచ్చరించారు. అలానే కాలిఫోర్నియా తీరంలో ఒక పడవ నుంచి డ్రోన్‌లతో దాడి చేసేందుకు ఇరాన్ పన్నుతున్న కుట్రపై తమ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.తాజాగా విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంపై కీలక విషయాలు తెలిపారు. "మేం తలచుకుంటే గంటలో వారి విద్యుత్ సామర్థ్యాన్ని కూల్చివేయగలం. దాన్ని మళ్లీ నిర్మించుకోవడానికి వారికి 25 ఏళ్లు పడుతుంది. కానీ మేం అలా చేయాలనుకోవడం లేదు" అని అన్నారు. ఇరాన్ సైనిక శక్తిని ఇప్పటికే తాము నిర్వీర్యం చేశామని, వారి నౌకాదళం, వాయుసేనలను తుడిచిపెట్టేశామని చెప్పారు.అమెరికా చేపడుతున్న సైనిక చర్యకు ఇతర శక్తిమంతమైన దేశాల నుంచి ప్రైవేట్‌గా మద్దతు లభిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. తమ సైనిక చర్యల ఫలితంగా ఇరాన్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోని సరిహద్దు విధానాల వల్ల ఇరాన్‌కు చెందిన స్లీపర్ సెల్స్ అమెరికాలోకి ప్రవేశించాయని ట్రంప్ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa