ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ కొరతతో మూతపడుతున్నహోటళ్లు, క్యాంటీన్లు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 11:51 AM

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తలెత్తిన గ్యాస్ కొరత, కరోనా కాలం నాటి భయానక లాక్‌డౌన్ రోజులను గుర్తుచేస్తోంది. ఇంధనం లేక వాహనాలు షెడ్లకే పరిమితం కాగా, గ్యాస్ దొరక్క హోటళ్లు, క్యాంటీన్లు తలుపులు మూసుకుంటున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ జీవనోపాధిని కోల్పోయి వీధిన పడుతున్నారు.ఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఒక్క హోటల్ రంగంలోనే వేల సంఖ్యలో రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇందులో పనిచేసే వెయిటర్లు, క్లీనర్లు, వంట మనుషులు మళ్లీ తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు.ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa