రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని, ప్రెస్‌మీట్‌లో అయన ప్రస్తావించిన అంశాలన్నీ వాస్తవమని, కాగ్ నివేదిక కూడా తేల్చిందని మాజీ ముఖ్యమంత్రి, జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా ఆర్థిక రంగం పూర్తిగా కుదేలైందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యథేచ్ఛగా దోపిడి కొనసాగుతోందని, కూటమి నేతలు దేన్నీ వదలిపెట్టకుండా అన్నీ దోచుకుంటోందని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 రోజులు జరిగినా, ఏ రోజూ ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని జగన్ గుర్తు చేశారు. అన్నీ తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారమే అని, ఏమీ చేయకపోయినా అన్నీ చేసినట్లు బిల్డప్ ఇవ్వడమే కాకుండా.. మొత్తం ‘ఆత్మస్తుతి..పరనింద’ అన్నట్లుగా సెషన్ సాగిందని ఆయన వాపోయారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌తో సహా ఏ పథకాలు పూర్తిగా అమలు చేయడం లేదని గుర్తు చేశారు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, రాష్ట్రాన్ని దారుణ ఆర్థిక దుస్థితిలోకి నెట్టేస్తోందని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నా, ఆ 5 ఏళ్లలో చేసిన అప్పును, ఈ కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని చెప్పారు. అతి ముఖ్యమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను చంద్రబాబు ప్రభుత్వం సర్వనాశనం చేసిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa