ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ

national |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 11:40 AM

40వ వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాను అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్'  విడుదల చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి బిలియనీర్ల సంఖ్య భారీగా పెరగడం విశేషం. గతేడాది భారత్ నుండి 205 మంది ఉండగా, ఈసారి ఆ సంఖ్య 229కి చేరింది. ఇందులో 30 మంది కొత్తగా ఈ క్లబ్‌లో చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 9,970 కోట్ల డాలర్ల సంపదతో భారత్, ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన పీఠాన్ని పదిలం చేసుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆయన 21వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 6,380 కోట్ల డాలర్ల నికర ఆస్తితో దేశంలో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మహిళల విషయానికొస్తే ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ 3,910 కోట్ల డాలర్ల ఆస్తితో దేశంలోనే అత్యంత ధనిక మహిళగా నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa