మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ జిల్లా కార్యాలయంలో దివంగత నేత ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమం జరిపారు. ఎర్రన్నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ...ఢిల్లీలో ఉత్తరాంధ్ర వాణిని వినిపించిన వ్యక్తి ఎర్రన్నాయుడని.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. వైసీపీ నాయకులు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారంలో ఉన్న ఒక్క నెలలో అయిన సీఎం జగన్ సక్రమమైన పాలన అందించాలని పల్లా శ్రీనివాస్ కోరారు.