ఓ యువకుడు ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించారు. కష్టపడి చదివి కోరుకున్న ప్రభుత్వ కొలువులు దక్కాయి. రెండేళ్లలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు, ఓ ప్రైవేటు కొలువు పొంది సత్తా చాటారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తొలాపికి చెందిన పప్పల హరి అప్పారావు, విజయలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు రమేష్ విజయనగరంలోని జేఎన్‌టీయూలో బీటెక్ (సీఎస్సీ) పూర్తి చేశారు. గతేడాది జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కుటుంబ సభ్యులు సూచించగా వెళ్లలేదు.
ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో - ఆపరేటివ్ బ్యాంకు మేనేజరుగా, ఎస్‌బీఐ కర్ల్క్‌గా, ఏపీజీవీబీలో ఆడిట్ అధికారిగా ఎంపికైనా వాటిల్లోనూ చేరలేదు. ఈక్రమంలో నాబార్డ్ నిర్వహించిన పరీక్షలకు సన్నద్ధమయ్యారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో గ్రేడ్-ఏ మేనేజరుగా అర్హత సాధించాడు. రమేష్ తండ్రి హరి అప్పారావు పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తానికి రమేష్ ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.