మహారాష్ట్ర టైమ్స్ ఆధ్వర్యంలో ముంబైలోని టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు మై మరాఠీ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ మై మరాఠీ ఫెస్టివల్ 3 రోజులపాటు జరగనుంది. టైమ్స్ గ్రూప్‌లోని మహారాష్ట్ర టైమ్స్ ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. అయితే ఈ మై మరాఠీ ఫెస్టివల్‌ను ఈ సమయంలోనే ఏర్పాటు చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫిబ్రవరి 19 వ తేదీన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి, ఫిబ్రవరి 27 వ తేదీన మరాఠా భాషాభిమాన దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు 3 రోజులపాటు మహారాష్ట్ర టైమ్స్.. ఈ మై మరాఠీ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసింది.
ఈ మై మరాఠీ ఫెస్టివల్ ముంబై నగరవాసులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. చాలా మంది ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు కూడా ఈ మై మరాఠీ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. "మై మరాఠీ.. ఉత్సవా మరాఠీచా" పేరుతో స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్‌ను ఈ మై మరాఠీ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేశారు. ఈ మై మరాఠీ ఫెస్టివల్‌లో పాల్గొన్న బీసీసీఎల్ వీసీఎండీ సమీర్ జైన్.. స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్‌ను సమీర్ జైన్ సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్ మహారాష్ట్రలోని అన్ని కళారూపాలు, ప్రదర్శనలు, కళలు, గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉంది. మహారాష్ట్రలోని గొప్ప సాంస్కృతిక విలువలను ప్రదర్శించేందుకు యువ ఔత్సాహికులు, కళాకారులు, విద్యార్థులు చేస్తున్న కృషిని సమీర్ జైన్ అభినందించారు.