రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తి అయ్యాయి. నాటో కూటమిలో చేరాలనుకున్న ఉక్రెయిన్‌ను నిలువరించేందుకు 2022 ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభించింది.
అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంతో రష్యా సైన్యంలో మరణించిన/గాయపడిన సైనికులు 3.15 లక్షలు అని, ఉక్రెయిన్ వైపు ఈ సంఖ్య 5 లక్షలు అని అమెరికా అంచనా వేసింది. ఉక్రెయిన్‌లో 10,200ల మంది పౌరులు చనిపోయినట్లు పేర్కొంది.