చంద్రబాబుకు రెస్ట్ అవసరమని నారా భువనేశ్వరి తన మనసులో మాట బయట చెప్పారని, ఆమె కోరికను తీరుద్దామని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన భర్తకు రెస్ట్ ఇవ్వమని కోరుతుందని తెలిపారు. ఆమె మీద ఉన్న గౌరవంతో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆయనకు పర్మినెంట్గా రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని కొడాలి నాని అన్నారు.