భారత మహిళ క్రికెట్ స్టార్ దీప్తి శర్మ డీఎస్పీగా నియమితులవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి పోలీసు ఆఫీసర్ అవ్వాలనేది తన కల అని అన్నారు.
ఇది ఎంత కష్టమైన వృత్తో తనకు తెలుసని.. కానీ ఒక్కసారైనా యూనిఫాం వేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. ఆగ్రాకు చెందిన దీప్తిని గత నెలలోనే డీఎస్పీగా నియమించిన యూపీ సర్కార్.. క్రికెటర్గా ఆమె ప్రదర్శనలకు రూ. 3 కోట్ల నగదు బహుమతి కూడా అందజేసింది.