మదనపల్లె పట్టణంలో ఆదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేస్తున్నామని డిఎస్పీ ప్రసాద్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. పరీక్షలు జరిగే కళాశాలలు, పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదన్నారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపలికి తీసుకు వెళ్లకూడదని సూచించారు.