సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకునిగా మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ఆయన నియోజకవర్గ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తారని పేర్కొంది. సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలనగా నియమించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. సంతనూతలపాడులో వైసీపీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానన్నారు.