పత్రిక కార్యాలయాలపైనా, పాత్రికే యులపైనా భౌతికమైన దాడులుకు పాల్పడడం అనాగరికమని కడప సీపీ ఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలో మీడియాపై దాడిని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాస్తా రాకో నిర్వహించారు. మీడియాపై దాడిని ఖండించాలని, ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలని, మీడియాపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సీఎం జగన అరాచక పాలనకు అడ్డులే కుండా పోతుందనడానికి ఈ సంఘటనలే కారణమన్నారు. కార్యక్ర మంలో సీపీఎం నాయకులు హరిశర్మ, ప్రభాకర్‌రెడ్డి, నాగరాజ, సురేం ద్ర, రఘునాథ్, నారాయణ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.