దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో తుమ్మలపల్లివారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్ తరాలకు అవ ధాన ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు ద్విసహస్ర అవధాని మాడు గుల నాగఫణిశర్మతో మహాశతావఽధానం నిర్వహిస్తామని తెలిపారు. సం స్కృత, ఆంధ్రభాషల్లో నిష్ణాతులైన 126 మంది పండితులు ఈ కార్యక్ర మంలో పాల్గొంటారని, నగరంలో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నామని తెలిపారు. భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని పరిరక్షించాలని, విద్యాభాషా వికాసం, విజ్ఞాన వికాసం కలిగించాలని నిర్వహిస్తున్న ఈ కార్య క్రమానికి అందరూ ఆహ్వానితులేనన్నారు.