గుంటూరు టౌన్-1 సబ్ డివిజన్ పరిధిలో రహదారి విస్తరణ పనులు, విద్యుత్ లైన్ల మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో శనివారం ఉదయం 7. 30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రాడీపేటలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ ముస్తాక్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు, ప్రజలు అంతరాయానికి సహకరించాలని కోరారు.