కనిగిరి ప్రాంత యాత్రికలకు తీర్థయాత్రల సందర్శనకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం శ్రీమన్నారాయణ శుక్రవారం తెలిపారు. కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి షిరిడీ యాత్ర కోసం మార్చి 11న రాత్రి 8గంటలకు బస్సులు బయలు దేరుతాయన్నారు. షిరిడీ యాత్రలో భాగంగా 12 పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్రలో భాగంగా భోజనాలతో కలుపుకుని ఒక్కొక్కరికి రూ. 7వేలు ఉంటుందని తెలిపారు.