ఏపీలో 10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై జైభీం రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ శనివారం ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. విజయవాడలో జడశ్రవణ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయనకు 100 మంది పార్టీ కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా జడ శ్రవణ్ మాట్లాడుతూ.. డీఎస్సీ కోటిఫికేషన్‌లో గిరిజన అభ్యర్థులకు తీరని ఆన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై ముందుగా నోటిఫికేషన్‌లో చెప్పలేదని... లాస్ట్‌లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారన్నారు. ఇది 10 లక్షలు మంది డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేయడమే అని అన్నారు. మంత్రి బొత్స, సీఎం జగన్‌పై జడ శ్రవణ్ మండిపడ్డారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎంబీబీఎస్ సీట్లను ఐదు కోట్ల చొప్పున ఈ ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. దీనిపై మంత్రి విడుదల రజిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జడ శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.