కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుందని.. ఇంగితజ్ఞానం లేకుండా అబద్ధాలు చెబుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తానని మోసం చేశారని, ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఒక్కరికీ మేలు చేయలేదంటూ దుయ్యబట్టారు. కొల్లు రవీంద్రలా నాటకాలాడటం మాకు రాదు. నవయుగ సంస్థను అడ్డుపెట్టుకుని కోర్టులో అడ్డంకులు సృష్టించింది మీరు కాదా?. 2004లో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను. మోసం చేసే కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. కళ్లుతెరిచి అభివృద్ధిని చూడు ఒకసారి. నీలాంటి స్థాయిలేనివాడితో.. గతిలేనివాడితో నేను చర్చకు రావడమేంటి?. ఏనాడైనా పేదవాడికి మేలు చేశావా?. మీలా దొంగ శంకుస్థాపనలు చేయడం మా వల్ల కాదు. మీ కుటుంబం కోసం నేను మాట్లాడను.. నాకు సభ్యత ఉందని పేర్ని నాని పేర్కొన్నారు.