సమాజంలోని ప్రజలందరికీ ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలు తొలగించాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనా కాలంలో ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు..ఈ ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికపరంగా తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలందరికీ వివరించాలని ఆయన పిలుపునిచ్చారు...తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యలయంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ న్యాయవాదులతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా మంగళగిరిలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు..అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమం అండగా నిలుస్తుందన్నారు..అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5000 స్టైఫండ్ చొప్పిన ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.. ఏ రాష్ట్రం అమలు చేయనటువంటి కార్యక్రమాన్ని దేశంలో మొదటి సారిగా జగన్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ఏ న్యాయవాది అయిన మరణిస్తే బార్ కౌన్సిల్ నాలుగు లక్షల రూపాయలు ఇస్తుందని, దానిని మ్యాచింగ్ గ్రాంటుని ప్రకటించిన ప్రభుత్వం కూడ మనదేనని ఆయన అన్నారు...ఈ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ నిధి కింద 25 కోట్ల ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తొందన్నారు.