రాయచోటి నియోజక వర్గంలో వైసీపీని ఓడించడమే మన అందరి కర్తవ్యమని, రాబోయే ఎన్నికల్లో రాయచోటి తెలు గుదేశం అభ్యర్థిని తానే అవుతానని, ఎన్నికల్లో తనను గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉందని రాయచోటి టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సంబే పల్లె మండలం గుట్టపల్లి వద్ద శతమానంభవతి కల్యాణ మండపంలో ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయచోటిలో టీడీపీ బాధ్యతలు గతంలో పాలకొండ్రాయుడు మోశాడని, 2014 ఎన్నికల నుంచి తాను ఆ బాధ్యతలను తాను భుజస్కంధాలపై వేసుకొని పార్టీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నియోజక వర్గంలో అధికార పార్టీ దోపిడీ, అరాచకాలను 90 శాతం గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియ జేసినట్లు తెలిపారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ సానుభూతి ఓట్లతో గెలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకం, అవినీతి ఎక్కు వైందన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్ప దన్నారు. టీడీపీలో కొంత మంది సమస్యలను సృష్టించి అధిష్టానానికి వెళ్లాల్సిన సంకేతాలను తప్పుదోవ పట్టించేలా సమస్యలను సృష్టిస్తున్న ట్లు తెలిపారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి పార్టీ టికెట్లు ఇస్తే సహకరించే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా తనను అధిష్టానం గురి ్తస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎస్. సోమవరం గ్రామానికి చెందిన కొంత మంది మైనార్టీలు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసారెడ్డి, నారా ప్రభాకర్‌నాయుడు, మాదిరెడ్డి రమేశ్‌రెడ్డి, బోనమల ఖాదర్‌వలి, ప్రభాకర్‌రెడ్డి, గోపీనాఽథ్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, వేణుగోపాల్ నాయుడు, మల్లు విష్ణువర్ధన్‌రెడ్డి, నూరెకరాల రంగారెడ్డి,భాస్కర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, బెల్లం నరసింహారెడ్డి, రౌతుకుంట ఖాదర్‌వలి, రాహుల్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.