సింగరాయకొండ మండలం శానంపూడిలో ఆదివారం ఉదయం 9 గంటలకు పల్లె పల్లెకు సురేష్ అన్న సిద్ధం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొంటారని పేర్కొన్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa