టీడీపీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలన్నా సంక్షేమ పథకాలు అర్హులకు అందాలన్నా టీడీపీ- జనసేన కూటమిని గెలిపించుకోవాలని తెలుగుమహిళలు పిలుపునిచ్చారు. నందిగామ , చందాపురంలో శుక్రవారం మహిళా నాయకులు మన్నే కళావతి, చెన్నుపాటి ఉషశ్రీ, మన్నే సాత్వికల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ మహిళా శక్తి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాఖమూరు స్వర్ణలత, ఉమామహేశ్వరి, నూకానమ్మ, అప్పారావు, నరేంద్ర, వీరాస్వామి, దారెల్లి బుజ్జి, పలువురు నాయకులు పాల్గొన్నారు.