కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో అటవీశాఖ తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది. మరికొద్ది రోజుల్లో శివరాత్రి పండుగ రాబోతోంది. దీంతో అనేక మంది భక్తులు కాలినడకన శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచే భక్తులు కాలినడకన వెళ్తుంటారు. అయితే కాలినడకన వెళ్లే వారి విషయంలో అటవీశాఖ తీసుకున్న నిర్ణయం భక్తుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి నల్లమలలో కాలినడకన వెళ్లే భక్తుల నుంచి టికెట్ వసూలు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. శివరాత్రికి నల్లమలలో లక్షల సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీశైలం వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అడవిలో కాలినడకన శ్రీశైలం వెళ్లాలంటే ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 టికెట్‌ను అటవీశాఖ వసూలు చేస్తోంది. ఇందుకు నిరసనగా కన్నడిగులు ఆందోళనకు దిగారు.