జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో భయానక ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఇంఫాల్ ధనమంజరి యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలింది.
ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 9:25 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు బాంబును పేల్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa