కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో షాపులు, వర్తక, వాణిజ్య భవనాలపై కన్నడ భాషలో మాత్రమే బోర్డులు ఉండాలని సూచించింది.
పరాయి భాష అయిన ఇంగ్లీష్‌లో బోర్డులు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని నిర్ణయించింది. దీంతో ఊరూరా ఇంగ్లీష్‌లో రాసిన బోర్డులను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మరోవైపు దీనిపై విమర్శలు వస్తున్నాయి.