రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శకుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని ఎట్టకేలకు ఆయన తల్లికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతినిధి కిరా యార్మిష్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ నెల 16న ఆర్కిటిక్ పీనల్ కాలనీలో నావల్నీ మరణించినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ.. భౌతిక కాయం ఎక్కడుందో తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa