ముంబై నుంచి టేకాఫ్‌కు సిద్ధమైన ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 479 విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఐదుగంటల పాటు దాన్ని నిలిపివేశారు.
ఏసీలు పనిచేయకపోవడంతో విమానంలో ఉన్న పిల్లలు, 78ఏళ్ల బనూదత్ బూలాకి అనే మహిళ శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని రద్దు చేస్తున్నట్టు ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు ప్రకటించారు.