రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌లకు సుమారు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం ప్రకటించింది. డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలలో తప్పు చేసినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి రూ. 2 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఆర్‌బిఐ 'ప్రూడెన్షియల్ నార్మ్ ఆన్ ఇన్‌కమ్ రికగ్నిషన్' ఆదేశాలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌కి రూ.66 లక్షల జరిమానా విధించబడింది. కొన్ని మార్గదర్శకాలను పాటించనందుకు కెనరా బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ.32.30 లక్షల జరిమానా విధించింది. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు రూ.16 లక్షల జరిమానా విధించింది.