గాజాలో ఆకలి కేకలు మోగుతున్నాయి. అక్కడి 23 లక్షల మంది జనాభా తీవ్ర ఆహార కొరతతో బాధపడుతున్నారు. ఇజ్రాయెల్ బెదిరింపులు మరియు దాడులకు లొంగిపోవడంతో 80 శాతం గాజన్లు ఇప్పటికే తమ ఇళ్లను విడిచిపెట్టారు.
కొన్ని నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వారికి తక్షణ సహాయం అందకపోతే, గాజా త్వరలో ఆకలితో కూడిన ప్రదేశంగా మారుతుందని ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) తాజా నివేదికలో వెల్లడించింది.