కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని కొండాపురం మండలం ముచ్చుమర్రి గ్రామ వద్ద వాహనాల తనిఖీ చేపట్టినట్లు ఎస్సై యోగీంద్ర సోమవారం తెలిపారు. కర్ణాటక బస్సులో గుత్తి నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న వంశీకృష్ణ అనే వ్యక్తి వద్ద రూ. 9, 68, 167 స్వాధీనం చేసుకొన్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనందున సీజ్ చేసినట్లు ఎస్సై వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.