తమ పార్టీకి చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసిందని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆరోపించారు. బీజేపీ గూండాయిజానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కాకుంటే.. సుఖు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సుఖు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.