టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి తొలి బహిరంగ సభ ‘తెలుగు జన విజయకేతన జెండా’కు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 25 ఎకరాల విస్తీర్ణంలో బుధవారం ఈ సభను నిర్వహించారు.
తొలి భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. వారిద్దరూ హెలికాప్టర్లో వేదిక వద్దకు చేరుకుంటారు.