ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ వ్యాసాలు రాసిన రష్యా మానవ హక్కుల కార్యకర్తపై అక్కడి కోర్టు కన్నెర్రజేసింది. ప్రభుత్వ చర్యను
తప్పుబడుతూ ఆర్టికల్స్ రాయడం నేరమంటూ 70 ఏళ్ల ఒలెగ్ ఓర్లోవ్కు 30 నెలల కారాగార శిక్ష విధిస్తూ మాస్కో కోర్టు తీర్పు చెప్పింది. రెండు సంవత్సరాల ఆరునెలల శిక్షను కోర్టు ఖరారుచేసింది.