ఏపీలో కాంగ్రెస్ తన తొలి హామీ ప్రకటించింది. అనంతపురం జిల్లా కేంద్రంలో న్యాయ సాధన సభ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..
ఏపీ ప్రజలకు ఒక పథకం గురించి చెప్పడానికి వచ్చానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ అభయం గ్యారంటీగా ఇస్తానని, ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు అందిస్తామన్నారు.