ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని,
ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది.