లోక్‌సభ ఎన్నికలకు ముందు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టం వచ్చే నెల నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా సీఏఏను అమలు చేయనుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
పౌరసత్వ నమోదు కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా సిద్ధం చేశామని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం ట్రయల్ రన్స్ నిర్వహించిందని వారు తెలిపారు.