ఏపీలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల కేజీ చికెన్ ధర రూ.300 పలుకుతోంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణం. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
కార్తీకమాసం సమయంలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అప్పుడు కిలో చికెన్ రూ.130 నుంచి రూ.140 చొప్పున అమ్మాల్సి వచ్చింది.