వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి ఆపార్టీ శ్రేణులకు ప్రజలను కోరారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురంలో తమ పార్టీ తలపెట్టిన సభ విజయవంతం అయిందని అన్నారు. గతంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని గుర్తు చేశారు.