వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తాజాగా యూనియన్ బ్యాంక్‌తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ డీలర్లకు యూనియన్ బ్యాంక్ రుణ సాయం చేస్తుంది.
దేశవ్యాప్తంగా 4,000 పైచిలుకు మారుతీ విక్రయ శాలల్లో వాహనాల నిల్వకు కావాల్సిన నిధుల సమీకరణ అవకాశాలను ఈ భాగస్వామ్యం మెరుగుపరుస్తుందని సంస్థ ప్రకటించింది.